
న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ మోటొరాడ్ ఇండియా తాజాగా ‘బీఎండబ్ల్యూ కే 1600 బీ’ అనే బ్యాగర్ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.29 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఇండియా). ‘ఇండియా బైక్ వీక్–2017’ కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించింది. 1649 సీసీ 6 సిలిండర్ ఇంజిన్, 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ , 5.7 అంగుళాల ఫుల్ కలర్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, ఏబీఎస్ ప్రొ, డైనమిక్ బ్రేక్ లైట్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, 3 రైడింగ్ మోడ్స్, ఎల్‌ఈడీ ఇండికేటర్స్, జెనాన్ హెడ్‌ల్యాంప్, క్రోమ్ సైలెన్సర్లు, ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ డైనమిక్ ఈఎస్‌ఏ చాసిస్, డియోలెవర్/పారాలెవర్ సస్పెన్షన్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. టూరింగ్ మోటార్ సైకిల్ విభాగంలో లగ్జరీ, పవర్, డిజైన్, సేఫ్టీ వంటి పలు అంశాలకు తమ కొత్త బైక్ బెంచ్ మార్క్‌గా నిలుస్తుందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవహ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బీఎండబ్ల్యూ మోటొరాడ్ డీలర్‌షిప్స్ వద్ద ‘బీఎండబ్ల్యూ కే 1600 బీ’ బైక్స్‌ను బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.