ఐదేళ్లలో 20 కొత్త మోడళ్లు: మారుతీ సుజుకీ | 20 new models in five years: Maruti Suzuki | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో 20 కొత్త మోడళ్లు: మారుతీ సుజుకీ

Jul 30 2015 1:17 AM | Updated on Sep 3 2017 6:24 AM

ఐదేళ్లలో 20 కొత్త మోడళ్లు: మారుతీ సుజుకీ

ఐదేళ్లలో 20 కొత్త మోడళ్లు: మారుతీ సుజుకీ

మారుతీ సుజుకీ కంపెనీ కొత్త మోడళ్ల జోరు ను పెంచుతోంది. 2020 కల్లా ఏడాదికి 20 లక్షల కార్లు విక్రయించే లక్ష్యంలో భాగంగా

వచ్చే నెలలో ఎస్-క్రాస్ ఎస్‌యూవీ

 న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ కంపెనీ కొత్త మోడళ్ల జోరు ను పెంచుతోంది. 2020 కల్లా ఏడాదికి 20 లక్షల కార్లు విక్రయించే లక్ష్యంలో భాగంగా ఐదేళ్లలో 20 కొత్త మోడళ్లను అందించనున్నామని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(సేల్స్, మార్కెటింగ్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. వచ్చే నెలలో ఎస్-క్రాస్ మోడల్‌ను మార్కెట్లోకి అందించనున్నామని పేర్కొన్నారు.  ఇలాంటి ప్రీమియం కార్లను ప్రత్యేక డీలర్షిప్(నెక్సా) ద్వారా విక్రయిస్తామని చెప్పారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,000 కోట్లు మూలధన పెట్టుబడులు పెట్టనున్నామని కంపెనీ సీఎఫ్‌ఓ అజయ్ సేత్  వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement