గ్రహం అనుగ్రహం (01-10-2019) | Daily Horoscope in Telugu (01-10-2019) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం(01-10-2019)

Oct 1 2019 6:45 AM | Updated on Oct 1 2019 6:45 AM

Daily Horoscope in Telugu (01-10-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి శు.తదియ సా.6.03 వరకు, తదుపరి చవితి నక్షత్రం స్వాతి రా.7.15 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం రా.12.35 నుంచి 2.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.04 వరకు తదుపరి రా.10.38 నుంచి 11.25 వరకుఅమృతఘడియలు... ఉ.10.50 నుంచి 12.22 వరకు.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.48
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. ఇంటర్వ్యూలు అందుతాయి వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వ సూలవుతాయి. స్థిరాస్తివృద్ధి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు లభిస్తాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలించవు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

కర్కాటకం: సన్నిహితులు, బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో ఆటంకాలు. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కన్య: రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

తుల: నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలలో అనూహ్య లాభాలు. ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. ఆస్తుల వ్యవహారాలు అనుకూలిస్తాయి. వాహనయోగం.

వృశ్చికం: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధి క్యం.వ్యాపార లావాదేవీలలో నిరాశ. ఉ ద్యోగాలలో బాధ్యతలు అ«ధికమవుతాయి.

ధనుస్సు: నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

మకరం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలోమరింత ఉన్నతి.

కుంభం: విలువైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మీనం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement