కొలువుదీరిన సొసైటీ పాలకవర్గాలు | YSRCP wins in society elections in new year | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన సొసైటీ పాలకవర్గాలు

Jan 7 2014 4:16 AM | Updated on Mar 18 2019 9:02 PM

జిల్లాలోని 20 సొసైటీలకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు సోమవారం జరిగాయి.

సాక్షి, కడప : జిల్లాలోని  20 సొసైటీలకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు సోమవారం జరిగాయి. అధ్యక్షులుగా ఎన్నికైన వారితో  ఎన్నికల అధికారులు లాంఛనంగా ప్రమాణ స్వీకారం చేయించారు. రైతుల శ్రేయస్సుతో పాటు  సొసైటీల అభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

 కాగా సొసైటీ ఎన్నికలలో  కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఓటర్లను ప్రలోభపెట్టినా తుది విజయం వైఎస్సార్ సీపీకే దక్కింది. నూతన సంవత్సరంలో జరిగిన మొదటి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయఢంకా మోగించడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం వెల్లివిరుస్తోంది. సొసైటీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి కాంగ్రెస్, టీడీపీ  ఖంగుతిన్నాయి.  టీడీపీ ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ నాలుగు  స్థానాలకే పరిమితమైంది.

Advertisement
 
Advertisement
Advertisement