'టీడీపీ అరాచకాలపై గవర్నర్‌ను కలుస్తాం' | ysrcp will meet the governor ovar tdp | Sakshi
Sakshi News home page

'టీడీపీ అరాచకాలపై గవర్నర్‌ను కలుస్తాం'

Feb 16 2016 12:19 PM | Updated on Aug 10 2018 8:16 PM

టీడీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అరాచకాలను, అకృత్యాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దృష్టికి ..

సాలూరు: టీడీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అరాచకాలను, అకృత్యాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజయకృష్ణా రంగారావు తెలిపారు. సాలూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ కేబినెట్ మీటింగ్‌లో అభివృద్ధిపై చర్చించకుండా వలసలపై చర్చిండమేమిటని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలోకి వస్తే..ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించి, భయబ్రాంతులకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రెస్ మీట్‌లో రంగారావుతోపాటు వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement