sujaya krishna rangarao
-
'టీడీపీ అరాచకాలపై గవర్నర్‌ను కలుస్తాం'
సాలూరు: టీడీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అరాచకాలను, అకృత్యాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజయకృష్ణా రంగారావు తెలిపారు. సాలూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ కేబినెట్ మీటింగ్‌లో అభివృద్ధిపై చర్చించకుండా వలసలపై చర్చిండమేమిటని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలోకి వస్తే..ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించి, భయబ్రాంతులకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రెస్ మీట్లో రంగారావుతోపాటు వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర కూడా పాల్గొన్నారు. -
'పట్టిసీమ ద్వారా అవినీతికి తలుపులు తెరిచారు'
హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్ట్‌లో అవినీతికి తలుపులు తెరిచి 20 శాతం అదనంగా కమిషన్లు నొక్కేయడానికి టీడీపీ ప్రభుత్వం సన్నద్ధాలు చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజయకృష్ణ రంగారావు ఆదివారం విమర్శించారు. ఇసుక, ధాన్యం కొనుగోలు విధానాలు ప్రవేశపెట్టి రూ.కోట్లలో అవినీతికి పాల్పడుతున్నారని రంగారావు దుయ్యబట్టారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాత నియోజక వర్గంలో అత్యంత అవినీతి జరిగిందని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేకు ఏసీడీపీ నిధులు ఇవ్వకపోవడం వల్ల తాగునీరు, రహదారులు వంటి కనీస అభివృద్ధి కార్యక్రమాలకు మోక్షం కలగడం లేదని ఆయన వాపోయారు. -
తెర్లాంలో లక్షదీపార్చన
విజయనగరం: శివరాత్రిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన లక్ష దీపార్చన కార్యక్రమాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఆర్.వీ.సుజయ్ కృష్ణ రంగారావు ప్రారంభించారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం చీకటిపల్లి గ్రామంలోని శివాలయంలో ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. వేల సంఖ్యలో వచ్చిన భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. (తెర్లాం)