ట్రిపుల్ తలాక్​కు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం

YSRCP Oppose Tripul Talk Bill Says Vijaya Sai Reddy - Sakshi

రాజ్యసభలో స్పష్టం చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి

బిల్లుపై విపక్షాల ఆందోళన

జేడీయూ, అన్నాడీఎంకే వాకౌట్‌

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై చర్చలో భాగంగా సభలో మాట్లాడిన ఆయన.. పార్టీ వైఖరిని తెలిపారు. బిల్లులోని పలు అంశాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ సివిల్‌ కాంట్రాక్ట్‌ కిందకు వచ్చే అంశమని, వాటికి క్రిమినల్‌ పనిష్మంట్‌ ఎలా ఇస్తారని విజయసాయి రెడ్డి సభలో ప్రశ్నించారు. చట్టంలో లేని అంశాల ఆధారంగా కఠిన శిక్ష ఎలా విధిస్తారని ప్రశ్నలను లేవనెత్తారు. ట్రిపుల్‌ తలాక్‌ చట్టం ముస్లిం పురుషుల పట్ల వివక్షపూరితంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి ఇది వరకే లోక్‌సభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

కాగా బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఇదివరకే ఆమోదం పొందగా.. రాజ్యసభలో ప్రస్తుతం చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్‌తో సహా, టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, సీపీఎం బిల్లును వ్యతిరేకించగా.. జేడీయూ, అన్నాడీఎంకే సభ నుంచి వాకౌట్‌ చేశాయి. మరో వైపు టీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top