అప్పుడు రూ.2వేలు అని, ఇప్పుడు .... | ysrcp mlas slams chandrababu govenrment over unemployment fund | Sakshi
Sakshi News home page

అప్పుడు రూ.2వేలు అని, ఇప్పుడు ....

Aug 23 2014 12:11 PM | Updated on Sep 5 2018 3:24 PM

నిరుద్యోగ భృతి విషయంలో చంద్రబాబు నాయుడు సర్కార్ మోసం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

హైదరాబాద్ : నిరుద్యోగ భృతి విషయంలో చంద్రబాబు నాయుడు సర్కార్ మోసం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2వేల భృతి ఇస్తామని, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రూ.1000 ఇస్తామంటున్నారని వారు వ్యాఖ్యానించారు.

 

అది కూడా ఎప్పటి నుంచి ఇస్తారో కూడా మంత్రి యనమల చెప్పలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. లబ్దిదారుల ఎంపిక పేరిట ఆంక్షలు కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల నెత్తిమీద చంద్రబాబు టోపీ పెడుతున్నారని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.

 

Advertisement
 
Advertisement
Advertisement