 
													సాక్షి, అనకాపల్లి: విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలో పర్యటించనున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు రూ.50 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. అనకాపల్లి, విశాఖ నగరాలను జంట నగరాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం అన్నివిధాల సహకారం అందిస్తారని పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
