ఆ అక్రమాలు శాంపిల్‌ మాత్రమే..! | YSRCP MLA G Srinivas Naidu Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలి

Feb 17 2020 4:37 PM | Updated on Feb 17 2020 8:18 PM

YSRCP MLA G Srinivas Naidu Comments On Chandrababu - Sakshi

సాక్షి, నిడదవోలు: ఐటీదాడుల్లో వెలుగు చూసిన అక్రమాలు శాంపిల్‌ మాత్రమేనని..టీడీపీ ముఖ్య నేతలపై కేంద్రం దృష్టి సారిస్తే నమ్మలేని వాస్తవాలు బయటకు వస్తాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దందాలు, కుంభకోణాలను వెలికితీయాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు.(ఐటీపై ఎల్లో డ్యాన్స్‌)

ఐటీ దాడుల్లో వెలుగు చూసిన  రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయన్నారు. రాజధాని భూముల వ్యవహారంలో కూడా వేల కోట్లు చేతులు మారాయని.. వీటిపై కేంద్రం విచారణ జరిపించాలని కోరారు. చంద్రబాబు ఆస్తులపై విచారణ చేపట్టాలని శ్రీనివాస్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. ('మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా')

Advertisement
 
Advertisement
Advertisement