అందుకే చంద్రబాబు చూసీ చూడనట్టు | ysrcp leaders slams cm chandrababu on 10th class paper leakage | Sakshi
Sakshi News home page

అందుకే చంద్రబాబు చూసీ చూడనట్టు

Mar 28 2017 10:04 AM | Updated on Jul 28 2018 2:48 PM

అందుకే చంద్రబాబు చూసీ చూడనట్టు - Sakshi

అందుకే చంద్రబాబు చూసీ చూడనట్టు

పదోతరగతి పేపర్‌ లీకేజీ అంశంపై బుధవారం ఏపీ శాసనసభ దద్దరిల్లింది

అమరావతి: పదోతరగతి పేపర్‌ లీకేజీ అంశంపై బుధవారం ఏపీ శాసనసభ దద్దరిల్లింది. వైఎస్ఆర్‌ సీపీ సభ్యులు పేపర్‌ లీకేజీపై చర్చకు పట్టుబట్టి పోడియం వద్ద నినాదాలు చేయడంతో స్పీకర్‌ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు.

అనంతరం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస్‌లను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నారాయణ టీడీపీకి పెట్టుబడి పెట్టారు కాబట్టే లీకేజీ వ్యవహారంపై చంద్రబాబు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేపర్‌ లీకేజీ వల్ల పేద విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంటే.. లీక్‌ చేసుకుంటూ నారాయణ గ్రేడ్లు సాధిస్తున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement