ఆనందమాయే! | YSRCP Leaders celebrates Jagan Bail Approval | Sakshi
Sakshi News home page

ఆనందమాయే!

Sep 24 2013 5:17 AM | Updated on Oct 17 2018 6:06 PM

జగన్ బెయిలు వార్తను వినడానికి ఆ పార్టీ నేతలు ఎంతో ఆత్రుతతో టీవీలకు అతుక్కుపోయారు.

సాక్షి, నిజామాబాద్: జగన్ బెయిలు వార్తను వినడానికి ఆ పార్టీ నేతలు ఎంతో ఆత్రుతతో టీవీలకు అతుక్కుపోయారు. బెయిల్ మంజూరు శుభవార్తను టీవీల్లో చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఆస్తుల కేసులో సీబీఐ వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని 2012 మే 27న అరెస్టు చేసింది. జగ న్ అరెస్టు పట్ల జిల్లాలో అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమైంది. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబం పట్ల కాంగ్రెస్ సర్కారు వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జగన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణు లు ఉద్యమం చేపట్టాయి. ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. ఎట్టకేలకు 16 నెలల నిర్బం ధం తర్వాత యువనేత మళ్లీ జనంలోకి రావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
 
 ఆనందంలో పార్టీ శ్రేణులు..
 జిల్లా కేంద్రంలో ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం పండగ వాతావరణం నెలకొంది.పార్టీ నాయకులు, కార్యకర్తలు రం గులు చల్లుకుని ఆనందం వ్యక్తం చేశారు. మిఠాయిలు తినిపించుకున్నారు. జై జగన్.. జైజై జగ న్ అంటూ నినాదాలు చేశారు. బాణాసంచా కాల్చారు. కాంగ్రెస్ సర్కారు అక్రమ కేసులు బనాయించి తమనేతను 16 నెలలు జైలులో పెట్టిందని, జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆ పార్టీ యువజన విభాగం నాయకులు బాజిరెడ్డి జగన్ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. జగన్‌కు బెయిల్ మంజూరు కావడం పట్ల నగరానికి చెందిన ఏఎం ట్రస్ట్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నేత జావెద్ అహ్మద్‌ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ‘సాక్షి’ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది మిఠాయిలు పంచుకున్నారు.
 
 ఆర్మూర్ పట్టణంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచి, బణాసంచా కాల్చారు. వేల్పూర్ మండలం అక్లూర్‌లో, మోర్తాడ్ మండలం ఏర్గట్లలో గ్రామస్తులు, పార్టీ నాయకులు టపాకాయలు కాల్చా రు. భీమ్‌గల్‌లో స్వీట్లు పంచుకున్నారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌చౌరస్తాలో, వర్ని, బీర్కూర్, కోటగిరిల్లో  వైఎస్‌ఆర్ సీపీ నాయకులు,ప్రజలు సంబరాలు చేసుకున్నారు. హంగర్గ ఫారం గ్రామంలో మహిళా నాయకురాలు రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. బోధన్ పట్టణంలో, సాలంపాడు, సాలూర క్యాంపుల్లో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జననేత కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థించారు. నిజాంసాగర్ ప్రధాన కూడలి వద్ద వైఎస్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జుక్కల్‌లో స్వీట్లు పంచుకున్నారు. సిరికొండ మండలం గడ్కోల్‌లో టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. మాచారెడ్డిలో నాయకులు స్వీట్లు తినిపించుకున్నారు. ఎల్లారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో సంబరాలు జరి గాయి. లింగంపేట్‌లో కార్యకర్తలు స్వీట్లు పం చుకున్నారు. సదాశివనగర్, పోసానిపేట్‌లలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement