రాప్తాడులో వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య | YSRCP leader prasad reddy brutally murdered in anantapur district raptadu | Sakshi
Sakshi News home page

రాప్తాడులో వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య

Apr 29 2015 12:19 PM | Updated on Jun 1 2018 8:31 PM

రాప్తాడులో వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య - Sakshi

రాప్తాడులో వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య

అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు.

అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు. రాప్తాడు తహసీల్దార్ కార్యాయంలో  వైఎస్ఆర్ సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్రెడ్డి (50)ని దుండగులు వేట కొడవళ్లతో నరికి చంపారు. ఓ పని నిమిత్తం ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన ఆయనను పథకం ప్రకారమే హతమార్చారు. ఈ దాడిలో సుమారు ఆరుగురు పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టీడీపీ వర్గీయులే ప్రసాద్ రెడ్డిని హతమార్చారని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు.

ప్రసాద్ రెడ్డి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌గా కూడా పనిచేశారు. మాజీ ఎమ్మల్యే గుర్నాథరెడ్డికి ఆయన ప్రధాన అనుచరుడు.  ప్రసాద్ రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement