సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ | YSRCP expell mandal meeting in eastgodavari district | Sakshi
Sakshi News home page

సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ

Aug 7 2015 6:25 PM | Updated on May 29 2018 4:23 PM

వై.రామవరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు బహిష్కరించారు.

తూర్పుగోదావరి (వై.రామవరం): వై.రామవరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు బహిష్కరించారు. అభివృద్థి కార్యక్రమాల గురించి స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారంటూ సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వంతాల రాజేశ్వరీ(రంపచోడవరం), స్థానిక ఎంపీపీ కర్రా వెంకటలక్ష్మీలతో పాటు పలువురు హాజరయ్యారు. ప్రభుత్వాధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement