వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పలువురిని నియమించారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పలువురిని నియమించారు. జి.వి.సునీత, అరుణారెడ్డి, టి.కామేశ్వరి, కొల్ల గంగాభవాని, వై.దమయంతి, ముగడ గంగమ్మ, చెన్ను విజయ, గంగడ సుజాతను రాష్ట్ర కమిటీలో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి మంగళవారం తెలిపారు. వెన్నా సత్యనారాయణరెడ్డిని రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యునిగా నియమించినట్లు రాష్ట్ర కోఆర్డినేటర్ టి.ఎస్.విజయచందర్ వెల్లడించారు.
వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌లోకి జయరాం
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ న్యాయ విభాగం రాష్ట్ర కమిటీలో గువ్వాజి జయరాంయాదవ్‌ను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ చిత్తర్వు నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పేర్కొన్నారు.