వైఎస్సార్ సీపీ నుంచి చంద్రగిరి జెడ్పీటీసీ సస్పెన్షన్ | YSR Congress suspension from the Chandragiri zptc | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ నుంచి చంద్రగిరి జెడ్పీటీసీ సస్పెన్షన్

Jan 13 2015 2:49 AM | Updated on May 25 2018 9:17 PM

పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి జెడ్పీటీసీ సభ్యురాలు సరిత, ఆమె భర్త రమణమూర్తిని చంద్రగిరి ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచనల

టీడీపీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్న సరిత
సీఎం కటౌట్ల కాంట్రాక్ట్ పొందిన జెడ్పీటీసీ భర్త
పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడంతోనే సస్పెన్షన్

 
చంద్రగిరి: పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి జెడ్పీటీసీ సభ్యురాలు సరిత, ఆమె భర్త  రమణమూర్తిని చంద్రగిరి ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచనల మేరకు సోమవారం పార్టీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు కే.నారాయణస్వామి సస్పెండ్ చేశా రు. పార్టీ చంద్రగిరి మండల పట్టణ అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, చిల్లకూరి యుగంధర్‌రెడ్డికి ఈ మేరకు నారాయణస్వామి నుంచి ఆదేశాలు అందారుు.  సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి మాట్లాడుతూ సరితను  వైఎస్సార్ సీపీ తరఫున జెడ్పీటీసీగా గెలిపించామన్నారు. గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు సరిత, ఆమె భర్త రమణ మూర్తి పార్టీ నిర్వహించిన ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదని తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను  సైతం ఏరోజూ  నిరసించలేదన్నారు.

అనునిత్యం టీడీపీ నాయకుల అదుపాజ్ఞల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. స్వలాభం కోసం నారా  చంద్రబాబు పంచన చేరారని తెలిపారు. ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కటౌట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే కాంట్రాక్టును ప్రభుత్వం నుంచి సరిత భర్త రమణమూర్తి దక్కించుకున్నారని తెలి పారు. దీనికి మండలంలోని టీడీపీ నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందించారని చెప్పారు. చిన్నగొట్టిగల్లు మండలంలో సుమారు వంద ఎకరాల ప్రభుత్వ భూమి రమణమూర్తి ఆధీనంలో ఉందన్నారు. టీడీపీలోకి మారితే డీకేటీ భూమిని   పట్టా చేయిస్తామని ఆ పార్టీ నాయకులు ఇచ్చిన హామీతో  సరిత, ఆమె  భర్త తెలుగుదేశం పార్టీ వైపు వెళుతున్నారని ఆరోపిం చారు. పైగా సీఎం సమక్షంలో సరిత, రమణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలి పారు.

దీంతో పాటు వైఎస్సార్ సీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులను సైతం అనేక రకాలుగా ప్రలోభాలు, ఒత్తిడులకు గురిచేస్తున్నారన్నారంటూ పార్టీ కార్యకర్తలు  వచ్చి తమ వద్ద ఆవేదన వ్యక్తం చేశారని  తెలిపారు. టీడీపీలోకి చేరమంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఒత్తిడి చేయ డం బాధాకరమన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో  క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి తెలిపామన్నారు. వారిని పార్టీనుంచి జిల్లా అధ్యక్షుడు బహిష్కరించారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement