
తక్షణమే అసెంబ్లీని సమావేశపరచండి: జగన్
కేంద్రం ముసాయిదా బిల్లును అసెంబ్లీకి రాకముందే... విభజనకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి డిమాండ్ చేసింది.
హైదరాబాద్ : కేంద్రం ముసాయిదా బిల్లును అసెంబ్లీకి రాకముందే... విభజనకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం గవర్నర్‌ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. రాష్ట్ర అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్య తీర్మానం చేసేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఈరోజు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.
రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల్ని, అసెంబ్లీ సమావేశపరచాల్సిన ఆవశ్యతకను గవర్నర్‌కు ఈ సందర్భంగా జగన్ వివరించారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపేలా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.గత నెలాఖరున కూడా వైఎస్ జగన్ ... గవర్నర్‌ను కలిశారు. అసెంబ్లీని సమావేశపరిచేలా చూడాలని వినతి పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. అడ్డుగోలు విభజన పట్ల పార్టీలు తమ వైఖరిని, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాన్ని చెప్పుకునేలా అవకాశం ఇవ్వాలని కోరారు
. ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా కేబినెట్ నోట్ ఆమోదం పొందడమే కాక...ప్రస్తుతం విభజన ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. ఈ సమయంలో అసెంబ్లీని సమావేశపరచడానికి అత్యున్నతులైన గవర్నర్ జోక్యాన్ని మరోసారి కోరుతున్నామన్నారు. రాష్ట్ర విభజన పట్ల అసెంబ్లీ నిర్ణయం ఏంటో తప్పనిసరిగా వెల్లడి కావాల్సిందేనన్నారు.