కాంగ్రెస్ విధానాల్ని ఎండగట్టండి: గౌరు | Ysr Congress party to launch agitation from Grass-roots level: Gouru Venkat Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ విధానాల్ని ఎండగట్టండి: గౌరు

Sep 30 2013 2:28 PM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకూ తీసుకు వెళతామని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు.

కర్నూలు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకూ తీసుకు వెళతామని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. సోమవారం ఆయన పాణ్యం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రజల జీవితాలతో  చలగటం ఆడుతున్న కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా నిలిచిన పార్టీ  వైఎస్ఆర్ కాంగ్రెస్సేనని  ప్రజలకు ఇది అర్థం అయ్యేలా చెప్పి ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచులతో దీక్షలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement