జేసీ సోదరులకు డిపాజిట్లు కూడా రావు | YSR Congress party leader Ravindranath reddy takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

జేసీ సోదరులకు డిపాజిట్లు కూడా రావు

Apr 12 2014 6:24 PM | Updated on Aug 14 2018 4:32 PM

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వీడదీశాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వీడదీశాయని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆ పార్టీ నేత రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. శనివారం అనంతపురంలో వైఎస్ జగన్ పర్యటన షెడ్యూలును రవీంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. వైఎస్ జగన్ 15న గుత్తి, ఉరవకొండ, కళ్యాణదుర్గం. 16న మడకశిర, పెనుకొండ,రాప్తాడులలో పర్యటిస్తారని తెలిపారు. అనంతరం రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ...టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని ఆరోపించారు. కమీషన్ల కోసం ఏ అక్రమమైన చేస్తాడని విమర్శించారు.

ఎల్లో మీడియా అండతో వైఎస్ జగన్పై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమేత్తారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆయన స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీలోఅవకాశాలు లేకే.. కాంగ్రెస్‌ సీనియర్లు టీడీపీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న జేసీ సోదరులకు డిపాజిట్లు కూడా రావని రవీంద్రనాథ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement