వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా ‘కోలగట్ల’ | YSR Congress Party district president Kolagatla Veerabhadra Swamy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా ‘కోలగట్ల’

Aug 21 2014 1:47 AM | Updated on May 25 2018 9:17 PM

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా ‘కోలగట్ల’ - Sakshi

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా ‘కోలగట్ల’

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కోలగట్ల వీరభద్రస్వామిని నియమిస్తూ బుధవారం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కోలగట్ల వీరభద్రస్వామిని నియమిస్తూ బుధవారం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావును నియమించారు. సుజయ్‌కృష్ణ రంగారావు ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా పని చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కోలగట్ల గతంలో ఎమ్మెల్యేగా, డీసీసీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పని చేశా రు. వీరి నియామకంపై పార్టీనాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement