
తెల్లని పంచెకట్టు..చెరగని దరహాసం..అందరినీ ఆదరించే ఆపన్నహస్తం..పేదల కన్నీళ్లకు ఆనకట్ట వేసే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సుందరరూపం.
తెల్లని పంచెకట్టు..చెరగని దరహాసం..అందరినీ ఆదరించే ఆపన్నహస్తం..పేదల కన్నీళ్లకు ఆనకట్ట వేసే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సుందరరూపం..ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ప్రతి ఇంటి గదిలో..గుండె గుడిలో ఆ దేవుని రూపం కొలువై ఉంది. ప్రతి ఊరూ..ప్రతి వాడా..ప్రతి పల్లె..ప్రతి పట్టణం..ప్రతి కుటుంబం వైఎస్ తమ గుండె చప్పుడులో ఉన్నాడంటూ నినదించింది.
బుధవారం వైఎస్ రాజశేఖరుని జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఆయనకు వాళులర్పించారు. మహానేత అందించిన సువర్ణయుగం మళ్లీ రావాలని..ఇప్పుడున్న ‘ఓటుకు కోట్లు’ కాలం పోవాలని ఆ దేవుడ్ని వేడుకున్నారు.