కర్నూల్‌ జిల్లాలో సమర శంఖం

YS Jaganmohan Reddy Will  Election Campaign In The District From Panyam Constituency - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  పాణ్యం నియోజకవర్గం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లులో ఈ నెల 18న ఉదయం 9.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

అధికార పార్టీ గత ఎన్నికల ముందు జిల్లాకు, పాణ్యం నియోజకవర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. పారిశ్రామిక హబ్‌గా ఓర్వకల్లును తీర్చిదిద్దుతామని, డీఆర్‌డీవో, న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు వంటి హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని మండిపడ్డారు. ఇక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ.. ఇప్పటికీ అనుమతులు లేక సగం సగం పనులు చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే కర్నూలు జిల్లాను..అందులోనూ పాణ్యం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కాటసాని తెలిపారు. ఈ అవినీతి, అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజాతీర్పుకు సూచికగా ఓర్వకల్లు సభ నిలవనుందని అభిప్రాయపడ్డారు.  

పాదయాత్ర తర్వాత... వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్నారు. ఆయన 2017 నవంబరు 14 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ వరకు మొత్తం 18 రోజుల పాటు జిల్లాలో పర్యటించారు. 14 నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. మొత్తం 263 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లో నడక సాగించారు. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో ఎన్నికల శంఖారావం సభల్లో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి ఎన్నికల శంఖారావాన్ని పాణ్యం నియోజకవర్గంలో పూరించనున్నారని పేర్కొన్నారు.  

భారీగా కదలిరండి– కాటసాని రాంభూపాల్‌ రెడ్డి 
ఈ నెల 18వ తేదీ సోమవారం ఉదయం 9.30 గంటలకు ఓర్వకల్లులో జరిగే బహిరంగ సభలో మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొంటారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాం. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాల ద్వారా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపుతారు. ఈ సభకు భారీగా తరలివచ్చి అధికార తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ప్రజలు చాటాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తరలిరావాలి.    

మరిన్ని వార్తలు

17-03-2019
Mar 17, 2019, 07:40 IST
సాక్షి , ఏలూరు : తెలుగుదేశం పార్టీ పెండింగ్‌లో పెట్టిన నాలుగు సీట్లపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆ నాలుగు...
17-03-2019
Mar 17, 2019, 07:27 IST
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్‌ అభ్యర్థిగా డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌ను ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్‌...
17-03-2019
Mar 17, 2019, 07:23 IST
సాక్షి, కొవ్వూరు :  జిల్లా రాజకీయాల్లో మాగంటి కుటుంబం దశాబ్దాల నుంచి ఉంది. తల్లిదండ్రులు, తనయుడు ముగ్గురూ మంత్రులుగా అవకాశం దక్కించుకున్న...
17-03-2019
Mar 17, 2019, 07:12 IST
సాక్షి, మంత్రాలయం :  మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి చేష్టలు శ్రుతిమించాయి.  ఆయన తీరు కారణంగా మంత్రాలయం మండలం...
17-03-2019
Mar 17, 2019, 05:37 IST
సాక్షి, హైదరాబాద్‌/కడప: సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం...
17-03-2019
Mar 17, 2019, 05:04 IST
కొల్లూరు: వేమూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారానికి ఆదిలోనే మహిళలు హంసపాదు పలికారు. గత...
17-03-2019
Mar 17, 2019, 04:15 IST
సాక్షి, హైదరాబాద్‌/విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచార భేరీ మోగించడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు...
17-03-2019
Mar 17, 2019, 02:54 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ అభ్యర్థుల ప్రక్రియ తుది దశకు చేరింది. అభ్యర్థుల ప్రకటనను టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా...
17-03-2019
Mar 17, 2019, 02:16 IST
సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్‌ చేయాలని, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్‌...
17-03-2019
Mar 17, 2019, 01:04 IST
సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల సన్నాహ సభలను ప్రారంభిస్తూ.. ‘కారు.. సారు.. పదహారు’ అని తమ విజయ నినాదంగా...
17-03-2019
Mar 17, 2019, 00:51 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి విడత లోక్‌సభ ఎన్నికల...
17-03-2019
Mar 17, 2019, 00:39 IST
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. టీపీసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే...
17-03-2019
Mar 17, 2019, 00:31 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ ఎన్నికల రణంలోకి దిగుతోంది. టీఆర్‌ఎస్‌...
17-03-2019
Mar 17, 2019, 00:24 IST
సాక్షి, న్యూఢిల్లీ: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలోకిదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడి...
16-03-2019
Mar 16, 2019, 21:17 IST
సాక్షి, హైదరాబాద్‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ...
16-03-2019
Mar 16, 2019, 21:05 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే...
16-03-2019
Mar 16, 2019, 20:37 IST
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు టీడీపీకి వత్తాసు పలుకుతున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను విధుల నుంచి తప్పించాలని బీజేపీ ఏపీ...
16-03-2019
Mar 16, 2019, 19:07 IST
సాక్షి, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల ముందు మంత్రి భూమా అఖిల ప్రియకు భారీ షాక్‌ తగిలింది. ఆమె సొంత మేనమామ, టీడీపీ...
16-03-2019
Mar 16, 2019, 19:03 IST
బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
16-03-2019
Mar 16, 2019, 18:48 IST
కెట్‌ లేదని చెప్పడంతో ఆయన కలత చెందారు. తన వర్గీయుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top