నేటి పర్యటన ఇలా.. | ys Jagan to campaign in Narasannapeta from tomorrow | Sakshi
Sakshi News home page

నేటి పర్యటన ఇలా..

Jul 18 2014 3:09 AM | Updated on Jul 25 2018 4:09 PM

నేటి పర్యటన ఇలా.. - Sakshi

నేటి పర్యటన ఇలా..

రెండు రోజుల శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నరసన్నపేట, టెక్కలి, పాలకొండ నియోజకవర్గాల్లో చెన్నై

   రెండు రోజుల శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నరసన్నపేట, టెక్కలి, పాలకొండ నియోజకవర్గాల్లో చెన్నై బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షడు ధర్మాన కృష్ణదాస్, ప్రొగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం పేర్కొన్నారు.   ఉదయం శ్రీకాకుళం నుంచి బయలుదేరి నరసన్నపేట మండలం బాలసీమ, సారవకోట మండలం సత్రాం గ్రామాలకు చెందిన బాధితులను పరామర్శిస్తారు.  అక్కడి నుంచి టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి మండలంలో చుట్టిగుండం, పాకివలస గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను ఓదారుస్తారు. అనంతరం భామిని మండలం కొరమ వెళ్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement