ఇడుపులపాయలో వైఎస్‌ జగన్‌ | YS Jagan reaches to Idupulapaya | Sakshi
Sakshi News home page

ఇడుపులపాయలో వైఎస్‌ జగన్‌

Sep 1 2017 8:53 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతి పక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఇడుపులపాయ చేరుకున్నారు.

సాక్షి, పులివెందుల(వైఎస్సార్‌ జిల్లా): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతి పక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు వేంపల్లె మండలం ఇడుపులపాయ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతీరెడ్డి, బ్రదర్ అనిల్ కుమార్, రాజారెడ్డి, అంజలి, హర్ష, వర్షలు కూడా చేరుకున్నారు. శనివారం ఉదయం దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 9వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement