
సాక్షి, కర్నూలు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లా జొన్నగిరిలో కొనసాగుతోంది. అక్కడినుంచి ఎర్రగుడి, తుగ్గలికి వైఎస్ జగన్ చేరుకోనున్నారు. అనంతరం చెరువుతొండ వరకూ పాదయాత్ర కొనసాగనుంది. ప్రజాసంకల్పయాత్రలో ప్రజలు వైఎస్ జగన్‌తో కలసి నడుస్తున్నారు.
తమ సమస్యలను జననేతతో చెప్పుకుంటున్నారు. రాత్రికి చెరువుతొండలోనే బస చేస్తారు. 24వ రోజు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ 15.6 కిలోమీటర్లు నడిచారు.