
సాక్షి, చీపురుపల్లి : పలకరించే జనం.. పరుగులు పెట్టే అభిమానం.. ఉరకలేసే ఉత్సాహం.. ప్రతి పల్లెలోనూ ఇదే సందడి. ప్రతి మనసులోనూ ‘అన్నొస్తున్నాడు’ అనే ఆనందం.. పుట్టెడు కష్టాలు చెప్పే వాళ్లు.. గుండె లోతుల్లోంచి ఆప్యాయతను పంచే ప్రజానీకం.. పూలబాటలు.. మంగళహారతులు.. ఇవీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో కనిపించే దృశ్యాలు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు దృఢమైన సంకల్పంతో రాజన్న తనయుడు చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో మరో మైలురాయి నమోదైంది. (డొంక కదులుతుందనే భయమా?)
ప్రజాసంకల్పయాత్ర @3100 కిమీ: వెల్లువలా జనం వెంట నడువగా విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గం ఆనందపురం క్రాస్ వద్ద ప్రజాసంకల్పయాత్ర 3100 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా ఆనందపురం క్రాస్ వద్ద ఈ మైలురాయికి గుర్తుగా జననేత వేప మొక్కను నాటారు. 281 వరోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత సోమవారం గుర్ల శివారు, కలవచర్ల, కోటగండ్రేడు, పాలవలస క్రాస్, అనందపురం క్రాస్ మీదుగా గరికవలస వరకూ నేటి యాత్ర కొనసాగనుంది. పాదయాత్ర సాగిన రోడ్లన్నీ ఇరుకుగా ఉన్నాయి. దీనికి తగ్గట్టు మండుటెండ.. ఉక్కపోత. జనం ఇవేవీ లెక్కచేయ లేదు. అడుగు కూడా ఖాళీ కన్పించనంతగా జనం కిక్కిరిసిపోయారు. తమనేతను కలవాలని, కష్టాలు చెప్పుకోవాలని పోటీపడ్డారు. ఆయన రాకకోసం గంటల తరబడి నిరీక్షించారు. కిలో మీటర్ల కొద్దీ క్యూ కట్టారు. మేడలు, చెట్లు, గోడలు, స్తంభాలు.. ఎక్కారు. అక్కడి నుంచి జగన్ స్పష్టంగా కన్పించారంటూ సంతోషించారు. (అసలైన నాయకుడు ఆయనే...)
చదవండి: