338వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | YS Jagan PrajaSankalpaYatra 338th Day Schedule Released | Sakshi
Sakshi News home page

Jan 5 2019 9:18 PM | Updated on Jan 5 2019 9:24 PM

YS Jagan PrajaSankalpaYatra 338th Day Schedule Released - Sakshi

 సాక్షి, శ్రీకాకుళం : అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 338వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు ఆదివారం ఉదయం ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం నైట్‌క్యాంపు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పలాసపురం, జింకిభద్ర క్రాస్‌, సోంపేట, ఇసకపాలెం క్రాస్‌, మండపల్లి క్రాస్‌ మీదుగా తలతాంపారి వరకు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement