నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ | YS Jagan pays tribute to YSRCP Senior leader Narayana Reddy | Sakshi
Sakshi News home page

నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Nov 2 2015 7:22 PM | Updated on Jul 25 2018 4:09 PM

అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దొంతిరెడ్డి నారాయణరెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.

రాజుపాలెం (వైఎస్సార్ జిల్లా) : అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దొంతిరెడ్డి నారాయణరెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం ఆయన రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామంలోని నారాయణరెడ్డి సమాధి వద్ద పుష్పమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నారాయణరెడ్డి సతీమణి మల్లమ్మ, కుమారులు సూర్యనారాయణరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలను పరామర్శించారు. పార్టీ వారికి అండగా ఉంటుందంటూ ధైర్యం చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement