కాఫీ తోటలకు రూ.లక్ష చొప్పున చెల్లించండి | ys jagan mohan reddy seeks government one lakh for victims of coffee garden | Sakshi
Sakshi News home page

కాఫీ తోటలకు రూ.లక్ష చొప్పున చెల్లించండి

Oct 18 2014 6:03 PM | Updated on Jul 25 2018 4:07 PM

కాఫీ తోటలకు రూ.లక్ష చొప్పున చెల్లించండి - Sakshi

కాఫీ తోటలకు రూ.లక్ష చొప్పున చెల్లించండి

తుపాను ప్రభావంతో భారీగా నష్టపోయిన కాఫీ తోటలకు రూ.లక్ష చొప్పన చెల్లించాలని ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

విశాఖ: తుపాను ప్రభావంతో భారీగా నష్టపోయిన కాఫీ తోటల రైతులకు రూ.లక్ష చొప్పన చెల్లించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గిరిజనులు మిరియాలు, కాఫీ తోటలతో ఎకరాకు లక్ష చొప్పున సంపాదిస్తున్నారని.. వారికి హెక్టారుకు రూ. 10 వేలు, రూ.15 వేలు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయాన్నిప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఎకరాలకు రూ.లక్ష చొప్పున పరిహారంగా ఇవ్వాలన్నారు. ఒకవేళ రూ.లక్ష చొప్పన పరిహారం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లు అవుతుందని జగన్ స్పష్టం చేశారు. కాఫీ పంటకు ఆధారమైన సిల్వర్ ఓక్ చెట్లు భారీ ఎత్తున కూలిపోయాయని.. మళ్లీ చెట్లు పెరగాలంటే 15 సంవత్సరాలు పడుతుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. శనివారం అనకాపల్లి, చోడవరం, మాడుగుల మండలాలల్లో తుపాను కారణంగా నష్టపోయిన బాధిత రైతులను జగన్ పరామర్శించారు. అనంతరం అక్కడ్నుంచి పాడేరులో పర్యటించారు.
 

వర్షంలోనూ తన పర్యటన కొనసాగిస్తున్న జగన్ మోదపల్లి వద్ద దెబ్బతిన్న కాఫీ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా  గిరిజనులు వైఎస్ జగన్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పంటలు పూర్తిగా నష్టపోయాయని, ఒక్కో చెట్టూ పెరగాలంటే 20 సంవత్సరాల కాలం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో ఎకరాకు రూ. 1,50 లక్షల వరకూ ఆదాయం వస్తుందని జగన్ కు తెలిపారు. దీంతో ఆవేదన వ్యక్తం చేసిన జగన్.. మిరియాలు, కాఫీ పంటల రైతులకు ఎకరాకు కనీసం రూ.లక్ష ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ చెట్లు లేకపోతే కాఫీ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని తెలిపారు.ఏ ఒక్క గిరిజనుడికి రెండు ఎకరాలు మించి లేదని జగన్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement