
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వైఎస్ జగన్ కాన్వాయ్‌లోని వాహనాలను పోలీసులు ఆపేశారు. కేవలం నాలుగు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు.
వివరాల ప్రకారం.. వైఎస్ జగన్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద కాన్వాయ్ వాహనాలను ఆపేసి.. కేవలం నాలుగు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు. నేతల కార్లు, బైకులను అడ్డుకుంటున్నారు. అభిమానంతో వస్తున్న ప్రజలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలోనూ పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, వైఎస్ జగన్ అభిమానులను పోలీసులు అడ్డుకుంటున్నారు. సామాన్య ప్రజలను కూడా పోలీసులు అత్యుత్సాహంతో అడ్డుకుంటున్నారు. అటు, స్థానికంగా ఉన్న షాపులను సైతం పోలీసులు మూయిస్తున్నారు. కార్యకర్తలు, అభిమానులు దూరంగా వెళ్లిపోవాలంటూ పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో, పోలీసుల తీరును అభిమానులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
అనకాపల్లి..
వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అనకాపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే మార్గంలో ఫ్లెక్సీలు కట్టకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో, వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసు తీరుపై ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై మండిపడుతున్నరు. కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలేసి వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలనే అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారని అంటున్నారు..