వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం లోగోను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారమిక్కడ ఆవిష్కరించారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం లోగోను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారమిక్కడ ఆవిష్కరించారు. ఇదే సందర్భంగా ఆయన విద్యార్థి విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, విద్యార్థి విభాగం ఏపీ అధ్యక్షుడు షేక్ సలాం బాబు, సందీప్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థి నాయకులు పరశురాం, శ్రావణ్, నాగార్జున యాదవ్, ఖాజా, దినేష్, హరిప్రసాద్‌రెడ్డి, రెడ్డిగారి రాకేశ్‌రెడ్డి, లింగారెడ్డి, అంజిరెడ్డి, నాగార్జున యాదవ్ పాల్గొన్నారు.