జగన్ బెయిల్పై విచారణ 18కి వాయిదా | YS Jagan mohan reddy bail plea adjourned to September 18th | Sakshi
Sakshi News home page

జగన్ బెయిల్పై విచారణ 18కి వాయిదా

Sep 12 2013 10:55 AM | Updated on Aug 8 2018 5:51 PM

జగన్ బెయిల్పై విచారణ 18కి వాయిదా - Sakshi

జగన్ బెయిల్పై విచారణ 18కి వాయిదా

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ఈనెల 18వ తేదీకి వాయిదా పడింది.

హైదరాబాద్ : బెయిల్‌ కోరుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలుకు ఐదు రోజులు  గడువివ్వాలన్న సీబీఐ విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. 18లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. అదే రోజు వాదనలు వింటానని కోర్టు ప్రకటించింది.  సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇచ్చిన నాలుగు నెలల  గడువు పూర్తవడంతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌ కోరుతూ  నిన్న సీబీఐ కోర్టులో బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

సీబీఐ విచారణను తాను ఏ విధంగానూ ప్రభావితం చేయకపోయినా 'సాక్షి' పెట్టుబడుల వ్యవహారంలో 15 నెలలకు పైగా తనను జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారని... ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తనకు బెయిల్ మంజూరు చేయాలని  జగన్‌మోహన్ రెడ్డి సీబీఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement