గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్‌ | YS Jagan To Meet Governor Narasimhan Toady evening | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్‌

Mar 6 2019 3:19 PM | Updated on Mar 6 2019 3:28 PM

YS Jagan To Meet Governor Narasimhan Toady evening - Sakshi

ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను కలవనున్నారు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను కలవనున్నారు. ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో డేటా కుంభకోణం, ఓట్ల తొలగింపు అక్రమాలపై వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ సర్కార్‌ చేస్తున్న అరాచకాలను కూడా గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement