సంకల్ప స్మృతులు

YS jagan Chittoor Praja Sankalpa Yatra Special Story - Sakshi

జనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యా తెలుసుకోవాలనుంది. వాళ్లతో కలిసి నడవాలనుంది. వాళ్ల గుండెచప్పుడు వినాలనుంది. అందుకే ప్రతి గడపకూ వస్తున్నా.– ప్రజాసంకల్పయాత్ర మొదలు పెట్టిన రోజు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలు

ఇది అక్షర సత్యమైంది. చరిత్రలో లిఖితమైంది. ప్రజా సంకల్ప యజ్ఞం జిల్లాలోని ప్రతి గడపనూ తాకింది. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని అక్కున చేర్చుకుని ఓదార్పునిచ్చింది. దీనులకు అభయాన్ని అందించింది. యువతలో ఉత్తేజాన్ని నింపింది. రాజకీయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ‘అన్నొస్తున్నాడ’నే భరోసానిచ్చింది. నేటికీ ఆ గురుతులు పదిలం. జనం దాచుకున్న జ్ఞాపకాలే దీనికి సాక్ష్యం.

చిత్తూరు, నగరి : వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించే రోజునే నగరి మండలం ముడిపల్లి గ్రామానికి చెందిన ప్రకాష్‌ ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నాడు. యాత్ర ముగిశాక శ్రీవారికి తలనీలా లు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. ఇప్పటివరకు అదే సంకల్పంతో జగన్‌ వెంట నడుస్తూ వస్తున్నాడు. యాత్ర ప్రారంభంలో ఇడుపులపా య నుంచి ఎర్రగుంట్ల నియోజకవర్గం పోట్లదుర్తి వరకు 6 రోజులు,  మైదుకూరు నుంచి ఆళ్లగడ్డ వరకు 4రోజులు, అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో 4రోజులు, చిత్తూ రు జిల్లా దామలచెరువు నుంచి శ్రీకా ళహస్తి వరకు, నెల్లూరు జిల్లా వెంక టగిరి నియోజకవర్గంలో 3 రోజులు, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో 3 రోజులు, విజయవాడ వంతెనపై నుంచి విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, మైలవరం, నూజి వీ డు, గన్నవరం, పెనమలూరు, పామ ర్రు, మచిలీపట్నం, పెడన, గుడివాడ ప్రాంతాల్లో 20 రోజులు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, గోపాలప ట్నం, ఉంగుటూరు, దెందులూరు, పాలకొల్లు, కొవ్వూరులో 8 రోజులు, తూర్పుగోదావరి జిల్లాలో రాజమం డ్రి వంతెన నుంచి రాజోలు, అమలాపురం ప్రాంతాల్లో పది రోజులు, విజయనగరం జిల్లాలో 3వేల కిలో మీటర్ల సంబరంలోనూ పాల్గొన్నా డు. ఈ సందర్భంగా ప్రకాష్‌ మాట్లా డుతూ ‘గతేడాది జనవరి 9న పెనుమూరు సమీపంలో స్థానిక చెరకు రైతుల సాధకబాధకాల గురించి జగనన్నకు తెలియపరిచా. అప్పుడు ఆయన నేను ఇచ్చిన చెరకు రసం తాగారు. ఆ అనుభూతి నేను మరువలేను. ఈనెల 10న తిరుపతి నుంచి పాదయాత్రగా వెళ్లి శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకుంటా’ అని తెలిపాడు.

అవన్నీ మరిచిపోయా..!
పలమనేరు:‘నేను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానిని. ఆయనను నా గుండె గుడిలో గూడుకుట్టుకున్నాను. అలాంటి మహానుభావుడి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్నాడని తెలిసి ఉప్పొంగిపోయా. ఆయనతో కలిసి నడవాలని తాపాత్రయపడ్డా. ఇడుపులపాయకెళ్లి అక్కడ జరిగిన పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నా. ఆ జిల్లా మొత్తం పూర్తయ్యేవరకు పాదయాత్రలోనే ఉన్నా. అప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. చెరువులు, బావుల వద్ద స్నానం చేశా. భోజనం కూడా చేయని రోజులున్నాయి. తర్వాత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కొంత దూరం నడిచా. చాలా సంతోషం అనిపించింది. ఆ బాధలన్నీ మరిచిపోయా’నని పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం పట్రపల్లెకు చెందిన వాసు గుర్తు చేసుకున్నారు. త్వరలో ప్రజాసంకల్పయాత్ర ముగియనున్న నేపథ్యంలో ఆయన తన మధుర జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు.        – వాసు, వి.కోట

అన్నొచ్చాడు
చిత్తూరు అర్బన్‌:‘మాది పూతలపట్టు. 2014 ఎన్నికల్లో రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. కానీ మాకు ఒక్క రూపాయీ మాఫీ కాలేదు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కట్టొద్దని చెప్పడంతో మానేశాం. రూ.9 వేలు అసలుకు మూడేళ్లలో వడ్డీ కలిపి రూ.20 వేలు అయింది. ప్రభుత్వం ఎలాంటి నగదు మా ఖాతాల్లో వేయలేదు. తీసుకున్న అప్పును వడ్డీతో కలిపి కట్టాల్సిందేనని బ్యాంక్‌ అధికారులు చెప్పారు.  మాకు జరిగిన అన్యాయాన్ని, నాయకులు చేసిన మోసాన్ని అన్న (వైఎస్‌.జగన్‌)కు చెప్పాం. నేనున్నాను.. మీకేం కాదు.. మంచి రోజులు వస్తాయి.. మీ సమస్యలను తీరుస్తానని అన్న మాటిచ్చారు.    – భాగ్యలక్ష్మి, పూతలపట్టు

ఉపాధి కల్పిస్తానన్నారు..
‘నేను గత ఏడాది బీ.టెక్‌ పూర్తిచేశా. పూ తలపట్టు వద్ద పాదయాత్రలో జగనన్నను కలిశా. ఆయన సొంత చెల్లెలుగా చూశారు. చిత్తూరు జిల్లా కేంద్రం లో  ఎలాంటి ఉపాధి, విద్యాకేంద్రాలు లేవు.. ఉన్నత చదువుల కోసం బెంగళూరు, చెన్నై వెళ్లాల్సి వస్తోందని చెప్పా. సమస్యలన్నీ  జగనన్న ఓపిగ్గా విన్నారు. మన ప్రభుత్వం ఏర్పాటయ్యాక యువతకు చిత్తూరులో మంచి ఉపాధి అవకాశాలు కల్పించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఆయన మాటపై మాకు నమ్మకం ఉంది.                   – గౌతమి, కట్టమంచి, చిత్తూరు

భవితకు బంగారు మాట
కలికిరి:‘అప్పుడు కలికిరి మండల పరిధిలో ప్రజాసంకల్పయాత్ర జరుగుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సార్‌ని కలవాలని మా కుటుంబం అంతా ఎదురుచూసింది. చాలా కష్టమనిపించింది. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కొన్ని రోజుల తర్వాత జగన్‌సార్‌ని కలిశాం. ఆయన ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఏమి చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు ? ఎలా చదువుతున్నావు..? అని అడిగారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు సాగించడం కష్టమవుతోందని చెప్పా. సార్‌.. వెంటనే స్పందించారు. తమ ప్రభుత్వం వస్తే ఉన్నత చదువులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ధైర్యం చెప్పారు. ఆ మధుర జ్ఞాపకాన్ని నా జీవితంలో మరువలేను.’  – సాయిచరణ్‌రెడ్డి, విద్యార్థి, కలికిరి

అన్న అంకితభావానికి ఫిదా!
తిరుపతి రూరల్‌: మాది తిరుపతి రూరల్‌ మండలం పద్మావతీపురం. పార్టీలకు అతీతంగా ప్రజలు అశీర్వదించడంతో పంచాయతీ సర్పంచ్‌గా గెలిచా. నాపై నమ్మకంతో మండల సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో భాగంగా రామచంద్రాపురం మండలం నెమ్మళ్లగుంటపల్లికి వెళ్లా. అక్కడ సదస్సులో మాట్లాడే అవకాశమొచ్చింది. పంచాయతీల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష, నిధులు అందించకుండా వేధిస్తున్న తీరు, చేపట్టాల్సిన చర్యలపై ఆయనకు వివరించాను. ప్రతి సమస్యను సానుకూలంగా ఆలకించడమే కాకుండా ముందు చూపుతో వాటిని పరిష్కరించేందుకు తాను చేపట్టే చర్యలను ఆయన చెప్పిన విధానం ఎంతో నచ్చింది. ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న విజన్‌ ఎంతో ఆకట్టుకుంది. ఆయన అంకితభావానికి ఫిదా అయ్యాను. ఆయనతో నడిచాను.  ప్రాణం ఉన్నంత వరకు ఆయన పార్టీలో కొనసాగుతా. పాదయాత్ర తర్వాత పూర్తిస్థాయి జగనన్న సైనికుడిగా మారా. – వి.గణపతినాయుడు, పద్మావతిపురం

నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం
మదనపల్లె: సీపీఎస్‌ రద్దు కోసం గళమెత్తినా ధైర్యం చెప్పేవారు లేరు. ఆందోళనలు చేసినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. అందుకే జగనన్నను కలిశాం. అక్కడ ఆయన్ను చూస్తే ఆశ్చర్యమేసింది. ఏ నమ్మకంతో ఒక వ్యక్తి వెనుక ఇంతమంది ప్రజలు, అభిమానులు వెంట పడుతున్నారనుకున్నా. ఆయన నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే సీపీఎస్‌ రద్దు చేయాలని ప్లకార్డులు చూపించాం. ఆయన ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఉద్యోగుల కష్టాలు తీర్చుతామని ధైర్యం చెప్పారు. ప్లకార్డులు చేతబట్టి మాతోపాటు నినాదాలు చేశారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని భరోసా ఇచ్చారు. ఆ మధుర జ్ఞాపకం ఇప్పటికీ నా కళ్లెదుటే కదలాడుతోంది. ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించా.        – సరస్వతి, ఉపాధ్యాయురాలు, పీలేరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top