290వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | YS Jagan 290th Day PrajasankalpaYatra Begins | Sakshi
Sakshi News home page

290వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Oct 21 2018 6:25 AM | Updated on Oct 21 2018 9:08 AM

YS Jagan 290th Day PrajasankalpaYatra Begins  - Sakshi

పారాది నుంచి పాదయాత్ర  గొల్లపేట క్రాస్‌, రోంపల్లి క్రాస్‌ మీదుగా రామభద్రపురం వరకు

సాక్షి, బొబ్బిలి(విజయనగరం జిల్లా): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆదివారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం పారాది నుంచి ప్రారంభమైంది. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు రానున్నాడనీ..అందరీ జీవితాలకూ వెలుగులు తీసుకొచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయన వస్తే గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లో జనం ఆరాట పడుతున్నారు.

జననేత ఎప్పుడు తమ ప్రాంతానికి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. పారాది నుంచి పాదయాత్ర  గొల్లపేట క్రాస్‌, రోంపల్లి క్రాస్‌ మీదుగా రామభద్రపురం వరకు కొనసాగనుంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement