నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం | YS Jagan is extremely angry over the arrest of Aluru MLA | Sakshi
Sakshi News home page

నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం

Aug 3 2026 2:56 AM | Updated on Aug 3 2026 2:56 AM

YS Jagan is extremely angry over the arrest of Aluru MLA

ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం

అర్ధరాత్రి భారీ పోలీసు బలగాలతో ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచి్చంది? 

ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యేని అరెస్టు చేయడం దుర్మార్గం.. బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమన్నా ఉగ్రవాదా?.. రాష్ట్రంలో అసలు రూల్‌ ఆఫ్‌ లా అనేది ఉందా? 

దాడి చేసినవారికి రక్షణ.. రాజకీయ కక్షతో బాధితులపై కేసులు 

ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని అరెస్టులు చేసినా.. ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా వెనక్కితగ్గం 

బాధితులకు అండగా నిలుస్తాం.. అన్యాయాన్ని నిలదీస్తాం.. అరాచక పాలనపై పోరాడుతాం..

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఏది?.. వాటికి బాధ్యత వహిస్తూ లోకేశ్‌ రాజీనామా ఎప్పుడు?

విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించేది ఎప్పుడు? 

ఒక్కో నిరుద్యోగికి మూడేళ్ల భృతి బకాయి రూ.1.08 లక్షలు ఇచ్చేదెప్పుడు? 

జెన్‌–జడ్‌ ప్రశ్నలకు చంద్రబాబు వద్ద, లోకేశ్‌ వద్ద సమాధానాలు లేవు.. 

ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ అక్రమ కేసులు.. అరెస్టులు..

సాక్షి, అమరావతి: ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షి ఇంటిపై అర్ధరాత్రి భారీ పోలీసు బలగాలతో దాడి చేసి.. ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. రాష్ట్రంలో నారా­సుర పాలనలో అరాచకం పరాకాష్టకు చేరిందంటూ మండిపడ్డారు. దాడి చేసిన వారికి రక్షణ కల్పి­స్తూ.. బాధితులపై అక్రమంగా కేసులు బనాయిస్తూ రాజకీయంగా కక్ష సాధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మా­ర్చి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారని.. ఆయనను పరామర్శించేందుకు తాను వెళ్లినప్పుడు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను చూసి ప్రభుత్వం భయపడి.. ఒక వీడియో క్లిప్‌­ను వక్రీకరించి చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన కేసులు పెట్టారంటూ ఎ­త్తి­చూపారు. ఒక వ్యాపా­ర వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీ­స్‌ స్టేషన్‌కు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపైనే కిడ్నాప్‌ కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు.

‘‘డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? వాటికి బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల చొప్పున 3 ఏళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారు?’’ అని జెన్‌–జెడ్‌ తరం ఇవ్వాళ గట్టిగా ప్రశ్నిస్తోందని గుర్తుచేశారు.

ఈ ప్రశ్నలకు మీ దగ్గర, మీ తనయుడు లోకేశ్‌ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు.. ప్రజలు వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు.. అన్యాయాన్ని నిలదీస్తాం.. అరాచక పాలనపై పోరాడతామని సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో వైఎస్‌ జగన్‌ ఆదివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

రాష్ట్రంలో అసలు రూల్‌ ఆఫ్‌ లా ఉందా?
‘‘చంద్రబాబు గారూ.. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైఎస్సార్‌సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు! బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైనా కేసులు! ప్రశ్నిస్తే అరెస్టులు! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం? చంద్రబాబు గారూం నేను సూటిగా అడుగుతున్నాను. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్‌ ఆఫ్‌ లా అనేది ఉందా? అని అనిపిస్తోంది.  

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు.. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు
శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్లినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రజాస్పందనను చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించారు. చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. 

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్‌ రాజ్యమా? గుంటూరు ఈస్ట్‌ మాజీ ఎమ్మెల్యే షేక్‌ మొహ్మద్‌ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా ఇదే రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్‌ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్‌ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? కేవలం వైఎస్సార్‌సీపీ నాయకుడని కేసు పెడతారా?

ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసులు
రాష్ట్రంలోని జెన్‌–జెడ్‌ తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ దగ్గర మీ తనయుడు లోకేశ్‌ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.

బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా?
చిప్పగిరి మండలం నేమకల్లులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటిపై టీడీపీవాళ్లు దాడిచేస్తే, తన ప్రాణా­­లకు ప్రమాదం ఉందని, తన కు­టుంబాన్ని కాపాడాలని ఆ కార్యకర్త ఎమ్మెల్యే విరూపాక్షికి  కాల్‌ చే­శా­డు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా? చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరా­ములు గాయపడ్డారు. 

నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మా­ర్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసు­లు బనాయిస్తున్నారు. ఎమ్మె­ల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్‌డిసు్క లను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో ప్రజలకు తెలియకూడదనే హార్డ్‌డిసు్కలను తీసుకెళ్లారా? చంద్రబాబు­గారూ సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను  మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా?

అన్యాయాన్ని నిలదీస్తాం.. అరాచక పాలనపై పోరాడతాం
చంద్రబాబు గారూ గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా ఎన్ని పోలీసు బలగాలను దించినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం. అన్యాయాన్ని నిలదీస్తాం. అరాచక పాలనపై పోరాడుతాం. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు. ప్రజలు వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు’’ అని జగన్‌ ఆ పోస్టులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement