289వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | YS Jagan 289th Day PrajasankalpaYatra Begins In Bobbili | Sakshi
Sakshi News home page

289వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Oct 20 2018 7:09 AM | Updated on Oct 20 2018 9:16 AM

YS Jagan 289th Day PrajasankalpaYatra Begins In Bobbili - Sakshi

సాక్షి, బొబ్బిలి(విజయనగరం జిల్లా): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం ఇందిరమ్మ కాలనీ  నుంచి ప్రారంభమైంది. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు రానున్నాడనీ..అందరీ జీవితాలకూ వెలుగులు తీసుకొచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయన వస్తే గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లో జనం ఆరాట పడుతున్నారు.

జననేత ఎప్పుడు తమ ప్రాంతానికి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. అక్కడి నుంచి పాదయాత్ర ఇందిరమ్మ కాలనీ, పోలవాని వలస, మెట్ట వలస, భోజరాజపురం క్రాస్‌, సీతారాంపురం మీదుగా పారాది వరకు కొనసాగనుంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement