
బుధవారం ఉదయం వైఎస్ జగన్ విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోని నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 261వ రోజు విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం వైఎస్ జగన్ విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోని బీచ్ రోడ్డులోని కామత్ హోటల్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఉషోదయం జంక్షన్, టీటీడీ ఫంక్షన్ హాల్ జంక్షన్, ఎంవీపీ కాలనీ, వెంకోజీ పాలెం పెట్రోల్ బంక్ జంక్షన్, హనుమంతవాక జంక్షన్ మీదుగా అరిలోవ జంక్షన్ వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమౌతుంది. అరిలోవ జంక్షన్ నుంచి చినగాదిలి వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. చినగాదిలిలో ముస్లిం మైనార్టీలతో వైఎస్ జగన్ ఆత్మీయ సమ్మెళనం కానున్నారు.