ఆత్మీయుడిని కోల్పోయాం : వైఎస్‌ భారతి | YS Bharati Tributes To DA Somayajulu | Sakshi
Sakshi News home page

ఆత్మీయుడిని కోల్పోయాం : వైఎస్‌ భారతి

May 20 2018 10:43 AM | Updated on Sep 4 2018 5:44 PM

YS Bharati Tributes To DA Somayajulu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు భౌతికకాయానికి సాక్షి మీడియా గ్రూప్‌ చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతి నివాళులు అర్పించారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబంలో ఒక ఆత్మీయుడిని కోల్పోయామని చెప్పారు. సోమయాజులు మరణం తీరని లోటని పేర్కొన్నారు.

శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 03.14 నిమిషాలకు తుదిశ్వాస విడించారు. డీఏ సోమయాజులు గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అగ్రికల్చర్‌ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని రూపొందించడంలో కీలక భూమిక పోషించారు.

Advertisement
 
Advertisement
Advertisement