సాక్షి, తాడేపల్లి: నేడు పింగళి వెంకయ్య వర్ధంతి. ఈ సందర్భంగా పింగళి వెంకయ్యకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘గుండెల నిండా దేశభక్తిని నింపుకుని.. మువ్వన్నెల జాతీయ జెండాను రూపొందించిన మన ఆంధ్రుడు పింగళి వెంకయ్య. నేడు ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు’ అని పోస్టు చేశారు.
త్రివర్ణ పతాకం.. ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి జాతీయ పతాక రూపశిల్పి మహనీయుడు పింగళి వెంకయ్య గారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, జాతీయ చైతన్యాన్ని ప్రజల్లో నింపిన నాయకుడిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా… pic.twitter.com/mOawlt5YGf
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2026


