పీఎస్ లో యువకుని ఆత్మహత్యాయత్నం | Youth attempts suicide in front of Police station | Sakshi
Sakshi News home page

పీఎస్ లో యువకుని ఆత్మహత్యాయత్నం

Nov 21 2015 7:32 PM | Updated on Aug 21 2018 9:20 PM

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

కొత్తపేట (తూర్పు గోదావరి జిల్లా) : తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తప్పుడు కేసులు నమోదు చేసి పోలీసులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ మొడిపర్రు గ్రామానికి చెందిన రామకృష్ణ(25) శనివారం సాయంత్రం పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పోలీసులు అతణ్ణి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి వెళ్లి రామకృష్ణను పరామర్శించారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement