పోలీసులను చూసి.. అక్కడికక్కడే మృతి | Young man Died in Lockdown Time out in Kurnool | Sakshi
Sakshi News home page

పోలీసులను చూసి పరుగులు తీసిన యువకుడు

Mar 27 2020 11:52 AM | Updated on Mar 27 2020 11:52 AM

Young man Died in Lockdown Time out in Kurnool - Sakshi

మృతి చెందిన వీరభద్రయ్య స్వామి

ఆదోని: మండల పరిధిలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన వీరభద్ర స్వామి(21) పోలీసులను చూసి పరుగులు తీస్తూ కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఇస్వి పోలీసులు లాక్‌డౌన్‌ పరిస్థితిని పర్యవేక్షించేందుకు వాహనంలో గ్రామానికి వెళ్లారు. పోలీసులను చూసి బసిరె కట్ట వద్ద కూర్చున్న వీరభద్రస్వామితో పాటు మరి కొందరు పరుగులు తీశారు. ఈక్రమంలో వీరభద్ర స్వామి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కణతపై చిన్న గాయం ఉంది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు జంగమ గౌరమ్మ, సిద్దయ్య స్వామి  కన్నీరు, మున్నీరుగా విలపించారు. ఇస్వి ఎస్‌ఐ ఆశాలత ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల తీరు వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని కొందరు విమర్శిస్తుండగా, ప్రజల బాగుకోసం లాక్‌ డౌన్‌ను సంపూర్ణంగా అమలు చేసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించడంలో తప్పేముందని మరికొందరు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement