'కేసీఆర్ ఇప్పుడెందుకు విభేదిస్తున్నారు' | yanamala ramakrishnudu questined kcr on sectuon 8 | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ఇప్పుడెందుకు విభేదిస్తున్నారు'

Jun 23 2015 3:28 PM | Updated on Aug 27 2018 8:44 PM

'కేసీఆర్ ఇప్పుడెందుకు విభేదిస్తున్నారు' - Sakshi

'కేసీఆర్ ఇప్పుడెందుకు విభేదిస్తున్నారు'

హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయడంపై వివాదం తగదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయడంపై వివాదం తగదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విభజన చట్టం ఆమోదించినప్పడు టీఆర్ఎస్ సంబరాలు చేసుకుందని ఆయన గుర్తు చేశారు. విభజన చట్టంలోనే ఉన్న సెక్షన్ 8 అమలు చేయమంటే ఎందుకు విభేదిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

సెక్షన్ 8 అమలుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చట్టసవరణ కోసం ప్రయత్నించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. విభజన చట్టం రూపకల్పనలో భాగస్వాములైన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement