వైఎస్ కుటుంబానికి దూరం చేసేందుకు కుట్ర | Y.S Rajashekhar reddy trying to stay far away | Sakshi
Sakshi News home page

వైఎస్ కుటుంబానికి దూరం చేసేందుకు కుట్ర

Nov 20 2013 4:51 AM | Updated on Aug 27 2018 9:19 PM

వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం, తమకూ మధ్య దూరం పెంచేం దుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవని వైఎస్సార్‌సీపీ నేత భూమానాగిరెడ్డి అన్నారు.

నంద్యాల, న్యూస్‌లైన్: వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం, తమకూ మధ్య దూరం పెంచేం దుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవని వైఎస్సార్‌సీపీ నేత భూమానాగిరెడ్డి అన్నారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి ’ దినపత్రికలో  తమకు వ్యతిరేకంగా ప్రచురితమైన కథనంపై   ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో మంగళ వా రం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆ కథనంలో ఏమాత్రం వాస్తవమున్నా తాను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధమన్నారు.
 
 లేని పక్షంలో రాధాకృష్ణ తన పేపర్, చానల్‌ను మూసుకునేందుకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈ నెల 22న ఆ పత్రిక కార్యాలయంలో రాధాకృష్ణను కలుస్తానని, అసత్య కథనంపై న్యాయపోరాటం చేస్తానన్నారు. వైస్సార్‌సీపీ తరపున నంద్యాల అసెంబ్లీ టికెట్ తనకు.. ఎంపీ టికెట్ ఎస్పీవై రెడ్డికి ఖరారైన విషయాన్ని రాధాకృష్ణ తెలుసుకుంటే మంచిదన్నారు. నంద్యాలలో పలువురు టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ లో చేరుతుండడంతో ముందుగానే మాట ఇచ్చా నని, అలాగే ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి స్థాని కంగా రచ్చబండలో పాల్గొనాల్సి ఉండడంతో తాము పార్టీ సమావేశానికి వెళ్లలేక పోయామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement