పుష్కరాలకు వెళ్తూ మహిళ మృతి | women died in road accident at east godavari distirict | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు వెళ్తూ మహిళ మృతి

Jul 18 2015 8:41 AM | Updated on Aug 30 2018 3:56 PM

పుష్కరాల కోసం వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.

వేంపల్లె : పుష్కరాల కోసం వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శనివారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో జరిగింది. వివరాలు.. వైఎస్సార్‌జిల్లా వేంపల్లె మండలం అల్లిరెడ్డిపల్లెకు చెందిన ఇందిరమ్మ(45) గ్రామంలోని కొంతమందితో కలిసి రాజమండ్రిలో గోదావరి పుష్కరాలకు వెళ్లారు.

కాగా, కొవ్వూరు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న సుమో టైరు ఫంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపారు. అయితే, మహిళ మూత్ర విసర్జన కోసం రోడ్డు దాటుతుండగా అటుగా వచ్చిన మరో సుమో ఢీ కొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement