ప్రకాశం జిల్లా పుల్లల చెరువు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ప్రియుడు మోసగించాడనే కారణంగా...
ప్రియుడు మోసగించాడని యువతి ఆత్మహత్యాయత్నం
Jul 18 2014 9:27 PM | Updated on Sep 2 2017 10:29 AM
పుల్లల చెరువు: ప్రకాశం జిల్లా పుల్లల చెరువు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ప్రియుడు మోసగించాడనే కారణంగా యువతి మనస్తాపం చెంది కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య పాల్పడింది.
యువతిని ప్రేమించి పెళ్లికి నిరాకరించి ప్రియుడు మోసం చేసినట్టు తెలుస్తోంది. అయితే పెద్దలు పంచాయితి పెట్టి యువతికి డబ్బులిచ్చేందకు ప్రయత్నించినట్టు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Advertisement


