ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య | woman killed her husband due to illegal contact | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య

Dec 26 2013 10:35 AM | Updated on Sep 2 2017 1:59 AM

వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలసి హత్య చేసిన సంఘటన తూర్పు గోదావరి, రాజోలు మండలం ములికిపల్లిగా గ్రామంలో గత అర్థరాత్రి చోటు చేసుకుంది.

వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలసి హత్య చేసిన సంఘటన తూర్పు గోదావరి, రాజోలు మండలం ములికిపల్లిగా గ్రామంలో గత అర్థరాత్రి చోటు చేసుకుంది. అనంతరం నిందితురాలు బత్తుల దుర్గా ఆమె ప్రియుడితో కలసి పరారైంది. దీంతో గురువారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 

పోలీసుల హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్య వివాహేతర సంబంధాన్ని భర్త నిలదీయటంతో భార్య బత్తుల దుర్గా ఆ ఘాతుకానికి ఒడిగట్టినట్లు స్థానికులు పోలీసులుకు వెల్లడించారు. గతంలో ఆమె భర్తపై హత్యాయత్నం చేసి జైలు కూడా వెళ్లి వచ్చిందని వారు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement