రైల్వే ఉద్యోగులను పచ్చి బూతులు తిట్టిన మహిళ : వైరల్‌ వీడియో | Woman Hulchul In Guntur Railway Station | Sakshi
Sakshi News home page

రైల్వే ఉద్యోగులను పచ్చి బూతులు తిట్టిన మహిళ : వైరల్‌ వీడియో

Jun 24 2018 9:23 PM | Updated on Aug 21 2018 4:21 PM

Woman Hulchul In Guntur Railway Station - Sakshi

రైల్వే పోలీసుతో వాగ్వాదానికి దిగిన మహిళ

పోలీసు అయితే ఏం చేస్తారు...?
నా వెంట్రుక కూడా పీకలేరు...
చెప్పుతో కొడతా లం... ఇక్కడే కూర్చుంటా.. ఎవడు వస్తాడో రండిరా... 

ఇవి గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఓ మహిళ అందుకున్న తిట్ల దండకం. తనకు టికెట్టు ఇవ్వలేన్న కోపంతో రైల్వే అధికారిపై నోటికి వచ్చిన తిట్లు అన్నీ తిట్టేసింది. అంతటితో ఆగకుండా రైల్వే పోలీసులపై కూడా ఒంటికాలిపై లేచింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ టికెట్టు తీసుకోవడానికి గుంటూరు రైల్వే స్టేషన్‌ కౌంటర్‌లో నిలబడింది. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి సకాలంలో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమెకు వెళ్లాల్సిన ట్రైన్ కాస్తా వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన మహిళ సదరు ఉద్యోగిపై తిట్ల దండకం అందుకుంది. నోటికొచ్చినట్టు రైల్వే సిబ్బందిని బూతులు తిట్టింది. సమస్య తెలుసుకోవడానికి వచ్చిన రైల్వే పోలీస్ని కూడా చెడామడా వాయించేసింది. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. (ప్రసార అర్హం కాని పదాలను తొలగించాం)

Advertisement
 
Advertisement
Advertisement