వివాహమైన 8 నెలలకే... | woman committed suicide in Prakasam district | Sakshi
Sakshi News home page

వివాహమైన 8 నెలలకే...

May 23 2017 4:46 AM | Updated on Sep 5 2017 11:44 AM

వివాహమైన 8 నెలలకే...

వివాహమైన 8 నెలలకే...

వారిద్దరివీ వేరువేరు కులాలు. ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కానీ, ఏమైందో ఏమోగానీ పెళ్లయిన 8 నెలలకే ఆ యువతి అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకుంది.

అనుమానాస్పదస్థితిలో యువతి ఆత్మహత్య
ప్రకాశం జిల్లా : వారిద్దరివీ వేరువేరు కులాలు. ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కానీ, ఏమైందో ఏమోగానీ పెళ్లయిన 8 నెలలకే ఆ యువతి అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంతనూతలపాడు మండలం చండ్రపాలెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ బల్లికురవ అశోక్‌ ఒంగోలుకు చెందిన రేష్మ (21)ను ప్రేమించి 8 నెలల క్రితం పెళ్లిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం వేకువజామున 4 గంటలకే ఆటో తీసుకుని ఒంగోలు వెళ్లాడు.

ఆ వెంటనే 4.30 గంటలకు ఇంటివెనుక నుంచి ఇంటిపైకి వచ్చిన వేపచెట్టు కొమ్మకు చీరతో ఉరేసుకుని రేష్మ ఆత్మహత్యకు యత్నించింది. ఆ అలికిడి విని చుట్టుపక్కల వారు ఇంటిపైకి ఎక్కి చీరను కత్తితో కోసి రేష్మను కిందకు దించారు. కానీ, ఆలోపే ఆమె ప్రాణాలు వదిలింది. ఘటన స్థలాన్ని సీఐ మురళీకృష్ణ, తహసీల్దార్‌ ప్రభాకర్, ఎస్సై షేక్‌ ఖాదర్‌బాషా పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement