బుచ్చయ్యచౌదరిపై మహిళల దాడి | Woman beats Gorantla Buchaiah Chowdary | Sakshi
Sakshi News home page

బుచ్చయ్యచౌదరిపై మహిళల దాడి

Jan 2 2014 12:32 PM | Updated on Jul 12 2019 5:45 PM

బుచ్చయ్యచౌదరిపై మహిళల దాడి - Sakshi

బుచ్చయ్యచౌదరిపై మహిళల దాడి

టీడీపీ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై మహిళలు దాడి చేశారు.

రాజమండ్రి: టీడీపీ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై మహిళలు దాడి చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. లాటరీ ద్వారా వాంబే గృహాల కేటాయింపు సందర్భంగా ఘర్షణ జరిగింది. ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బుచ్చయ్యచౌదరి.. లాటరీ విధానాన్ని అడ్డుకుని వస్తువులను ధ్వంసం చేశారు.

దీంతో ఆగ్రహించిన మహిళలు ఆయనపై దాడి చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అనుచరులు బుచ్చయ్యచౌదరిపై రాళ్లు విసిరినట్టు చెబుతున్నారు. ఘర్షణ వాతావరణంతో రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement